టాప్ 10 తెలుగు న్యూస్ 5-9-2023

టాప్ 10 తెలుగు న్యూస్ 5-9-2023, భారీ వర్షాలు, విద్యాసంస్థల సెలవు, ముంపుకు గురియనా ప్రాంతాలు, ఇస్రో లక్ష్యాలు, రాజకీయ విశేషాలు, సినీ విశేషాలు మరి ఇంకెన్నో విషయాలు

Update: 2023-09-05 07:12 GMT

మతమే మా అభిమతం!

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి సరికొత్త అస్త్రాన్ని అందిస్తున్నాయి. ఎలాంటి శషభిషలు లేకుండా హిందుత్వను సమర్ధించే భాజపాకు వివాదాలను తనకు అనుకూలంగా ఎలా మలచుకోవాలో బాగా తెలుసు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరోసారి 'ఇండియా-పాకిస్థాన్' మ్యాచ్
సెప్టెంబరు 4న తమ చివరి గ్రూప్ గేమ్‌లో నేపాల్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఆసియా కప్‌లో సూపర్ ఫోర్ దశకు భారత్ అర్హత సాధించింది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో పాక్ తో తలపడిన భారత్.. సెప్టెంబర్ 10, 2023న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్

బాలీవుడ్‌ బాద్ షా షారూఖ్‌ ఖాన్‌ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కుమార్తె సుహానా ఖాన్‌, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలాగైతే కష్టమే.. మళ్లీ పెరిగిన బంగారం ధర

మంగళవారం నాడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,320గా ఉంది. గత 24 గంటల్లో.. 22 క్యారెట్ల బంగారం ధరపై 100 రూపాయలు.. 24 క్యారెట్ల బంగారం ధరపై 100 రూపాయలు పెరిగింది.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఉత్తమ్‌కు కీలక బాధ్యతలు.. అభ్యర్థుల ఖరారు ఆయన చేతుల్లోనే.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు హైకమాండ్‌ కమిటీ ఏర్పాటు చేసింది.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత.. ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి

భారీగా కురుస్తున్న వానలకు హైదరాబాద్ నగరం తడిసిముద్దవుతుంది. ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తివేస్తుండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

బౌలింగ్ అటాక్ పై విమర్శలు వచ్చినా.. భారీగానే గెలిచాం

ఆసియా కప్-2023 టోర్నీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్ పై ఘన విజయం సాధించింది.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో విద్యా సంస్థలకు సెలవు

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన కారణంగా ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

మహిళా బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి: కవిత లేఖ

ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల నేపథ్యంలో వివిధ రకాల బిల్లులపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలని డమాండ్‌ ఆమె డిమాండ్‌ చేస్తున్నారు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

కోటి రూపాయలను పంచనున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. వంద కుటుంబాలకు

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

పవన్‌కి 'హరిహర వీరమల్లు'పై ఇంటరెస్ట్ లేదు.. నిర్మాత కామెంట్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మొదటిసారి ఒక యోధుడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరిహరవీరమల్లు’ (Hari Hara Veera Mallu). 17 వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి రియల్ స్టోరీని కథాంశంగా తీసుకోని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.











Tags:    

Similar News