ఫోటోగ్రాఫర్‌కు రోజుకు 15 లక్షలుట!

Update: 2016-12-02 13:11 GMT

నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి గీతావిష్కరణ ఈ నెల 16 న, చిత్రం విడుదల సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న అవుతుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల పోస్టర్ల డిజైన్ కోసం నందమూరి బాల కృష్ణ, శ్రీయ శరన్ ల ఫోటో షూట్ కోసం నిర్మాత రాజీవ్ రెడ్డి భారీగా వెచ్చించారు ట! మద్రాస్ నుంచి ప్రముఖ ఫోటోగ్రాఫర్ జి.వెంకట రామన్ ను ప్రత్యేకంగా పిలిపించి పోస్టర్ డిజైన్ల కోసం హీరో హీరోయిన్లపై ప్రత్యేక ఫోటో షూట్ జరిపించారు.

హీరోయిన్ శ్రీయ శరన్ కి జి.వెంకట రామన్ మంచి మిత్రుడు అట. ఆవిడ సిఫారసు మీదే నిర్మాతలు ఈ ఫోటోగ్రాఫర్ ను పిలిపించారు అని సమాచారం. గతంలో మ్యాగ్జిమ్ ఇన్నర్ వేర్ కోసం శ్రేయ కు ఫోటో షూట్ జి.వెంకట రామ్ చేశారుట. ఇతర మ్యాగజిన్ కవర్ పేజీలకు శ్రీయ ఇచ్చిన బికినీ సొగసులు కూడా వెంకట రామ్ మూడవ నేత్రం నుంచే వెలువడ్డాయి. ఈ ఫోటోగ్రాఫర్ రోజుకు పదిహేను లక్షల పారితోషికాన్ని వసూలు చేస్తుంటాడు అంట. రెమ్యునరేషన్ భారీగానే ఉన్నా బాలయ్య 100 వ చిత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రాజీవ్ రెడ్డి ఏమాత్రం రాజీ పడకుండా భారీ పారితోషికాలు వెచ్చించి విడుదల పోస్టర్లు డిజైన్ చేయిస్తున్నారు. సంక్రాంతి పండుగకి విడుదల కానున్న మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రంతో గౌతమీ పుత్ర శాతకర్ణి పోటీకి దిగుతుండటంతో ప్రచారానికి బాగా ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు.

Similar News