ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు ఎలా వున్నా ఎవరికి వారే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని ఇప్పటినుంచే ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమం లో వైసీపీ, కమ్యూనిస్ట్ లు బీటలు వారుతున్న బిజెపి, టిడిపి బంధాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎన్డీయే కూటమి విచ్ఛిన్నం అయితే చంద్రబాబు తో జత కట్టాలని కమ్యూనిస్ట్ లు, బిజెపి తో తమకు పరిస్థితి ఇక సానుకూలం అవుతుందన్న అంచనాలో వైసిపి వర్గాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమం లోనే తాజా రాజకీయ స్థితి గతులు వచ్చే ఎన్నికల్లో కొత్త కూటములకు ఏర్పాటు తెరవెనుక సమాలోచనలు జోరుగా సాగుతున్నాయి.
మళ్ళీ టిడిపితో జత కట్టాలని ...
ఏపీలో కమ్యూనిస్ట్ పార్టీలకు విభజన తరువాత జరిగిన ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిలేలా ఒక్కసీటు దక్కలేదు. ఆ పార్టీలతో ఎవరు పొత్తు పెట్టుకున్నది లేదు. దాంతో ఇప్పుడు బిజెపి తో టిడిపి విడిపోయిన పక్షంలో తక్షణమే పొత్తు పొడుపు మాటలు మొదలెట్టేయాలన్న ఆసక్తి కనపరుస్తున్నారు కామ్రేడ్ లు. ఇక వైసిపి ఆలోచన మరో రకంగా వుంది. టిడిపి బిజెపి లకు బ్రేక్ అయితే కమలంతో చేతులు కలిపేందుకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేసింది. తాజా పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని ఆ పార్టీ ఎదురు చూపులు చేస్తుంది. ఇలా ఎవరికి వారే కొత్త పొత్తులు ఎత్తులకు కాచుకుని కూర్చోవడం విశేషం.