ఎన్టీఆర్ బయోపిక్ ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీయార్ బయోపిక్ తీస్తామని నందమూరి బాలకృష్ణ ప్రకటించడంతోనే చాలా వివాదాలు మొదలయ్యాయి. నాదెండ్ల భాస్కరరావు., లక్ష్మీపార్వతి., దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వాళ్లు సినిమా పూర్తి వాస్తవాలతో సాధ్యం కాదని., ఏకపక్షంగా నిర్మిస్తే అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. . నిజానికి ఓ సినిమాకు అవసరమైనంత డ్రామా ఎన్టీయార్ నిజ జీవితంలో ఉంది. ఎన్టీయార్ జీవితాన్ని వెండి తెరకెక్కిస్తాం అని బాలకృష్ణ ప్రకటించిన వెంటనే ఎవరిని విలన్‌గా చిత్రీకరిస్తారు? ఎక్కడి వరకు తెరకెక్కిస్తారు అనే ప్రశ్నలు బయల్దేరాయి.
డైరెక్టర్ ఈయనేనా?
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్టు వర్క్ పూర్తయినట్టు సమాచారం. ఎన్టీయార్ నిమ్మకూరులో ఇంటింటికి తిరిగి పాలు అందించిన దగ్గర్నుంచి, చెన్నయ్ రావడం, టాప్‌స్టార్‌గా ఎదగడం, రాజకీయాల్లోకి రావడం, కేంద్రంలో కాంగ్రెస్‌ను ఎదురించి, రాష్ట్రంలో అధికారంలోకి రావడం వరకు మాత్రమే ఈ సినిమా ఉంటుందనే విషయం తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ప్రస్థానం’ డైరెక్టర్ దేవ్‌కట్టా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా ఉంది. అయితే మరికొంత మంది సన్నిహితులు మాత్రం ఆ రోజు బాలకృష్ణ ఏదో యథాలాపంగా ఎన్టీయార్ బయోపిక్ గురించి మాట్లాడాడని, ఆ సినిమా చేసే ఉద్దేశం నిజంగా బాలయ్యకు లేదని అంటున్నారు.