విశాఖవాసులకు బంపర్ ఆఫర్.. ఆస్ట్రేలియాకు రాను పోను రూ.26,400 లతోనే
ఆస్ట్రేలియా పర్యాటక శాఖ తమ దేశానికి పర్యాటకులను రప్పించేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించింది;

విశాఖపట్నం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? అయితే ఆస్ట్రేలియా పర్యాటక శాఖ తమ దేశానికి పర్యాటకులను రప్పించేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ నుంచి ఆస్ట్రేలియాకు రాను పోను 26,400 రూపాయలకే టిక్కెట్ ఇస్తామని ప్రకటించింది. పర్యాటక శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది.
పర్యాటక రంగం కోసం...
టూరిజం వెస్టన్ ఆస్ట్రేలియా, స్కాట్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా విశాఖలో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా ఈ ప్రకటన చేసింది. స్కాట్ పెర్త్ కు వెళ్లాలంటే కేవలం 13,200 రూపాయలు మాత్రమే సరిపోతుందని తెలిపింది. ఈ నెల 18వ తేదీ వరకూ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని తెలిసింది. ఈ నెల 28వ తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకూ, మే 16వ తేదీ నుంచి జూన్ 14 వరకూ, తిరిగి జులై రెండో తేదీ నుంచి అక్టోబరు 20వ తేదీ వరకూ ఈ ఆఫర్ లో ప్రయాణించే వీలుందని తెలిపింది.