వైజాగ్ ఎయిర్ పోర్టు.. నాలుగు నెలలు ఆంక్షలే

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి సమయంలో విమానాలు నాలుగు నెలలకు పైగా

Update: 2023-08-04 04:49 GMT

రన్‌వే పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి సమయంలో విమానాలు నాలుగు నెలలకు పైగా నిలిపివేయనున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో రాత్రివేళ విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. వైజాగ్ ఎయిర్​పోర్టు భారత నావికాదళం అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు, ఎయిర్​క్రాఫ్ట్​లు ఐఎన్​ఎస్ డేగా రన్​వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కూడా ఈ రన్​ వే మీదుగానే జరుగుతాయి. నావికాదళం ప్రతి పదేళ్లకు ఓసారి తమ రన్​వేలకు రీ-సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది. ఇందులో భాగంగా రన్​వేపై మూడు పొరల్ని తొలగించి మళ్లీ కొత్తగా వేస్తారు. ఐఎన్ఎస్ డేగాలో 2019లో రీ-సర్ఫేసింగ్ నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు దాకా రీ-సర్ఫేసింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

నవంబర్ 15 నుండి మార్చి 2024 చివరి వరకు రాత్రి సమయంలో విమానాలకు రన్ వే మీద ఎంట్రీ ఉండదు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు విమానాలు నడపరు. నాలుగు నెలల పాటు రాత్రిపూట విమాన సర్వీసులను నిలిపివేయడం వల్ల శీతాకాలపు పర్యాటక సీజన్‌లో టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు శీతాకాలంలో అరకు, లంబసింగి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.


Tags:    

Similar News