Exit Polls : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్డీఏదే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే
మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి
మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీస్థానాలున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఎన్డీఏకు మహారాష్ట్రలో 182 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పింది. అదే సమయంలో మహా వికాస్ అఘాడీకి 97 స్థానాలు, ఇతరులకు తొమ్మిది స్థానాలు మాత్రమే వస్తాయని తేల్చింది. సీఎన్ఎన్ - న్యూస్ 18 సర్వే ప్రకారం ఎన్డీఏకు 154, మహావికాస్ అఘాడీకి 128, ఇతరులకు ఎనిమిది స్థానాలు వస్తాయని తేల్చింది. మహారాష్ట్ర మ్యాజిక్ ఫిగర్ 146 గా ఉంది. లోక్ శాహీ మరాఠీ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 128 నుంచి 142 స్థానాల్లో గెలుస్తాయని, మహా వికాస్ అఘాడీకి 125 నుంచి 140 స్థానాలు, ఇతరులు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు స్థానాలు వచ్చే అవకాశముందని తేల్చి చెప్పింది.