Maharashtra Elections : కాంగ్రెస్ మహారాష్ట్రలో ఐదు గ్యారంటీలు ఇవే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి గ్యారంటీ బాట పట్టింది

Update: 2024-11-07 01:35 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి గ్యారంటీ బాట పట్టింది. గెలుపునకు గ్యారంటీలే పనికొస్తాయని మరొకసారి నమ్మింది. కర్ణాటక, తెలంగాణలో తరహాలో మహారాష్ట్రలో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ప్రకటించినప్పటికీ గెలుపును సాధించలేకపోయింది. అయితే తమను ప్రజలు విశ్వసించినా ఈవీఎంల కారణంగానే తాము ఓటమి పాలయ్యామని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో...
అందుకే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఐదు గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళ్లింది. తొలుత గ్యారంటీలపై కొంత ఆలోచించి చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఐదు గ్యారంటీలను ప్రకటించారు. ఈ ఐదు గ్యారంటీలను చూసి ప్రజలు తమవైపు మళ్లుతారని భావిస్తుంది. మహారాష్ట్రలో కూటమిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా మారఠా రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందుకోసమే ఐదు గ్యారంటీల పేరుతో ముందుకు వెళ్లింది. ప్రజలు తమను ఆదరిస్తారన్న విశ్వాసంతో ఐదు గ్యారంటీలను మళ్లీ ప్రజల ముందుకు తెచ్చింది.
ఇవీ హామీలు...
మహారాష్ట్రంలో ఐదు గ్యారంటీలకు భాగ్య లక్ష్మి అని నామకరణం చేసింది. ఈ ఐదు గ్యారంటీలు ఇవీ... 1. మహిళలకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. 2. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 3. మూడు లక్షల వరకూ వ్యవసాయ రుణమాఫీతో పాటు 15 లక్షల వరకూ కుటుంబ ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపింది. 4. కులగణన చేస్తామని తెలిపింది. 5. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపింది. దీంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలుపు బాట నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. ప్రజలు వీరి ఐదు గ్యారంటీలను విశ్వసిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News