Maharashtra Elections : మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుత కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించే దిశగా దూసుకుపోతుంది
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుత కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఉన్న 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2019 స్థానాల్లో మహాయుత కూటమి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో 129 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. యాభై ఆరు స్థానాల్లో ఏక్ నాధ్ షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన 35 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
బీజేపీ అత్యధిక స్థానాలలో...
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లయింది. బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేరు బలంగా వినిపిస్తుంది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ బాద్యతలను స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ తెలిపారు. ఫడ్నవిస్ తో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాస్కులే కలిసి ఆయనతో ముఖ్యమంత్రి పదవిపై చర్చించనున్నారు. అయితే బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశమై ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయించే అవకాశముంది. అలాగే ఉప ముఖ్యమంత్రులు కూడా షిండే వర్గం, పవార్ వర్గం నుంచి కూడా ఉండే అవకాశాలున్నాయి.