Maharashtra Elections : మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆధిక్యత కనపరుస్తుంది. మొత్తం 126 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆధిక్యత కనపరుస్తుంది. మొత్తం 126 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 106స్థానాల్లో మహ వికాస్ అఘాడీ కి చెందిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే తొలుత ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలట్స్ ను లెక్కింపు మొదలుపెట్టారు. ఇవి ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే. వీటిని చూసి మనం ఒక అంచనాకు రాలేకపోయినా.. ఓటర్ల మనోభావాలను తెలుసుకోవాలంటే కొద్దిగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్లుగానే ట్రెండ్స్ వస్తున్నాయి.
రెండు కూటమిల పాలనను...
మహారాష్ట్రలో రెండు కూటమిల పరిపాలనను ప్రజలు చూశారు. తొలుత కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ పాలనను చూశారు. తర్వాత బీజేపీ, శివసేన ( ఏక్ నాధ్ షిండే) కూటమి పాలన కూడా మరాఠా ప్రజలు చూశారు. రెండు కూటముల పాలనను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు చెప్పినట్లే కనిపిస్తుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 145 గా ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలవాలంటే కనీసం 150కి పైగా స్థానాలను దక్కించుకోవాల్సి ఉంది. ఎర్లీ ట్రెండ్స్ మాత్రం బీజేపీ కూటమికి అనుకూలంగా కనిపిస్తున్నాయి.