ఈ నెల 25వ తేదీ వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బిజినెస్ అడ్వయిజరీ సమావేశం ముగిసింది. ఈ నెల 25వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Update: 2022-03-07 07:44 GMT

బిజినెస్ అడ్వయిజరీ సమావేశం ముగిసింది. ఈ నెల 25వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 13 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. తాము ఇచ్చే 25 అంశాలపైన చర్చ జరగాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు కోరారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి జగన్ బీఏసీ సమావేశంలో సీరియస్ అయినట్లు తెలిసింది.

జగన్ సీరియస్.....
గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని జగన్ అన్నారు. గవర్నర్ ఎవరి పార్టీ కాదని, ఎందుకు ప్రసంగాన్ని అడ్డుకున్నారని జగన్ అచ్చెన్నాయుడిని నిలదీసినట్లు తెలిసింది. అంత పెద్ద వయసు ఉన్న వారిని అవమానించడం తగదని చెప్పారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబుతో పాటు టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. 13 రోజుల పాటు జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 20 కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది.


Tags:    

Similar News