Ap Budget : టీడీపీ బాయ్ కాట్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు బహిష‌్కరించి శాసనసభ నుంచి వెళ్లిపోయారు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు బహిష‌్కరించి శాసనసభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమయిన వెంటనే గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని పదే పదే అడ్డుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ ప్రసంగం వద్దు అంటూ వారు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం కాపీలను చించి వేశారు.
మార్షల్స్ తో వాగ్వాదం.....
దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ సభ్యులను అయితే పది నిమిషాలు పాటు నినాదాలు చేసిన టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు సభ నుంచి వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అయితే లాబీల్లో ఉన్న టీడీపీ సభ్యులను మార్షల్స్ వచ్చి అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. గవర్నర్ ప్రసంగం ముగించి వెళ్లే మార్గంలో అడ్డుకుంటారని భావించి మార్షల్స్ అక్కడి నుంచి టీడీపీ సభ్యులను బయటకు పంపుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ సభ్యులు లాబీల్లో నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు.