ఏపీ సర్కార్ రికార్డు.. ఒక్కరోజులోనే మూడు లక్షల మందికి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక రికార్డు సృష్టించింది. ఒకే రోజు మూడు లక్షలకు మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక రికార్డు సృష్టించింది. ఒకే రోజు మూడు లక్షలకు మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించింది. ఏపీలో జనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి కొంత సమయాన్ని కూడా కేటాయించారు. ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం అమలు తీరుపై ముఖ్యమంత్రి జగన్ నివేదికలు తెప్పించుకుంటూ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మూడు కోట్ల మందికి పైగా...
తాజాగా మూడు లక్షల మందికి పైగా ప్రజలకు వైద్యసేవలను ఒక్కరోజులోనే అందించిన రికార్డును ఏపీ ప్రభుత్వం సొంతం చేసుకుంది. వాలంటీర్లు, వైద్య సిబ్బంది ప్రతి గడపకూ వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఏడు రకాల పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్యలుంటే అక్కడికక్కడే ఆరోగ్యపరమైన సలహాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,495 వైద్య శిబిరాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. 32.7 లక్షల మందికి వైద్య పరీక్షలను నిర్వహించింది. 5.94 కోట్ల మందికి పైగా ర్యాపిడ్ పరీక్షలను నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం ద్వారా 3.52 కోట్ల మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు