ఉద్యోగుల సమస్యలపై మంత్రి బొత్స
ఉద్యోగ సంఘాలతో హెచ్ఆర్ఏ శ్లాబులపై కూడా చర్చించామన్న ఆయన, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీపై రగడ జరుగుతూనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా పెన్ డౌన్ లోనే ఉన్నారు. శుక్రవారం ఉద్యోగులతో జరిపిన చర్చలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. శనివారం మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చించి.. ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తామని తెలిపారు. 23 ఫిట్‌మెంట్ తర్వాత ఉద్యోగుల జీతాల నుంచి రికవరీపై అభ్యంతరాలు వ్యక్తంచేశారని అన్నారు.
Also Read : పోర్న్ వీడియోలకు బానిసలై.. కటకటాల పాలైన దంపతులు
ఉద్యోగ సంఘాలతో హెచ్ఆర్ఏ శ్లాబులపై కూడా చర్చించామన్న ఆయన, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయమే తీసుకుంటామని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. ఏదేమైనా ఈ సాయంత్రానికల్లా ఉద్యోగుల సమస్యకు ఒక స్పష్టమైన పరిష్కారం ఉంటుందన్నారు.