Andhra Pradesh : ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది

Update: 2024-07-16 11:19 GMT

ఈ నెల 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు బిల్లుకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం లభించింది. కొత్త ఇసుక విధానంపై చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక పై ఎలాంటి జోక్యం చేసుకోవద్దని తెలిపారు. ఇసుక క్వారీలపై పెత్తనం కోసం ప్రయత్నిస్తే చెడ్డపేరు తెచ్చుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదని తెలిపింది.

రుణాలు పొందేందుకు...
అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించింది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్‌లుఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే మహిళలకు ఉచిత బస్ విధానంపై అధ్యయనం చేయాల్సి ఉందని, త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పౌరసరఫరాల శాఖ రెండు వేల కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారంటీకి మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది.


Tags:    

Similar News