కర్నూలు జిల్లాలో చిరుత కలకలం
కర్నూలు జిల్లాలో చిరుత కలకలం రేపుతుంది. రామకొండ వద్ద చిరుతను స్థానికులు చూశారు.
కర్నూలు జిల్లాలో చిరుత కలకలం రేపుతుంది. రామకొండ వద్ద చిరుతను స్థానికులు చూశారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుతపలి కొన్ని మేకలను చంపి తినడంతో గొర్రెల కాపరులు భయాందోళనలకు గురవుతున్నారు. దేవినేని కొండల్లో చిరుతపులిని చూసినట్లు వారు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతంలోకి గొర్రెలు, మేకలను తీసుకెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు వారికి చెప్పారు.
కల్యాణదుర్గంలోనూ....
అలాగే కల్యాణదుర్గంలోనూ చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. ఆవులను చంపి తినడంతో చిరుతపులి పనిగా స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడ మకాం వేసి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నారు. ఎవరూ గేదెలు, ఆవులను మేపుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని సూచిస్తున్నారు.