నెలాఖరులో పారిస్ కు జగన్

ముఖ్యమంత్రి జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈసారి వ్యక్తిగత పర్యటనతోనే జగన్ వెళుతున్నారు;

Update: 2022-06-16 13:14 GMT
నెలాఖరులో పారిస్ కు జగన్
  • whatsapp icon

ముఖ్యమంత్రి జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈసారి వ్యక్తిగత పర్యటనతోనే జగన్ వెళుతున్నారు. ఆయన ఈ నెలాఖరుకు ఫ్రాన్స్ కు వెళుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ పెద్ద కూతురు హర్షిణి రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.

కాన్వొకేషన్ కోసం....
పారిస్ లోని ప్రతిష్టాత్మకమైన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో హర్షిణి రెడ్డి మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీన బిజినెస్ స్కూల్ లో కాన్వొకేషన్ జరగనుంది. ఈ కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ ఈ నెలాఖరుకు కుటుంబ సమేతంగా పారిస్ వెళుతున్నారు.


Tags:    

Similar News