రేపు తిరుపతికి జగన్
ముఖ్యమంత్రి జగన్ రేపు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు;
ముఖ్యమంత్రి జగన్ రేపు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తిరుపతి సమీపంలోని వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో జగన్ పాల్గొంటారు. అనంతరం శ్రీకాళహస్తికి జగన్ వెళతారు. ముఖ్యమంత్రి జగన్ హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమ భూమి పూజలో పాల్గొననున్నారు.
వివిధ కార్యక్రమాల్లో....
రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చేరుకుని అక్కడ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరు చేరుకుంటారు. అక్కడ హిల్ గాప్ సెట్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ భూమి పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వికృతమాలలో వివిధ పరిశ్రమల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 3.50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.