Srisailam : శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సోమవారం కావడంతో ఎక్కువ మంది భక్తులు వచ్చారు;

Update: 2025-04-14 04:17 GMT
devotees, monday, crowd, srisailam
  • whatsapp icon

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సోమవారం కావడంతో ఎక్కువ మంది భక్తులు వచ్చారు. వరస సెలవులు రావడంతో భక్తులు శ్రీశైం మల్లన్నను దర్శించుకునేందుకు బారులు తీరారు. నల్లమలలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు వచ్చిన భక్తులందరూ శ్రీశైలానికి చేరుకుంటుండటంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి చేరుకుని మల్లన్నను దర్శించుకుంటున్నారు. సోమవారం శివుడికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పాతాళగంగలో స్నానాలు చేసి భ్రమరాంబ మల్లికార్జులన స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News