జాతీయ రహదారిపైకి వరద నీరు - స్థంభించిన రాకపోకలు

విజయవాడ - ఏలూరు జాతీయ రహదారిపై వరదనీరు నిలిచిపోయింది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపేశారు;

Update: 2024-09-01 02:56 GMT
cyclone,  threat, meteorological department, andhra pradesh
  • whatsapp icon

విజయవాడ - ఏలూరు జాతీయ రహదారిపై వరదనీరు నిలిచిపోయింది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపేశారు. బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపై వరదనీరు అడుగుల మేరకు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు ఇరవై కిలో మీటర్ల మేర వాహనాలను నిలిచిపోయాయి. కేవలం అత్యవసర వాహనాలను మాత్రమే అధికారులు జాతీయ రహదారిపైకి అనుమతిస్తున్నారు.

20 కిలోమీటర్ల మేర...
పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయకముందు కొందరు వాహనదారులు వరదనీటిలో దిగడంతో వాహనాలు నీటిలోనే ఆగిపోయాయి. దీంతో అధికారులు అన్ని వాహనాలను పూర్తిగా నిలిపేశారు. బస్సుల్లో ప్రయాణికులు చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా భారీ వర్షం పడుతుందన్న హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. జాతీయ రహదారిపైకి ఎవరిని అనుమతించడం లేదు.


Tags:    

Similar News