ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.;

Update: 2024-09-02 02:34 GMT
flooding, krishna river, second hazard alert,  prakasam barrage
  • whatsapp icon

కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులు గా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ప్రజలు అలెర్ట్ గా...
కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని కోరింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దంటూ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Tags:    

Similar News