Kakani Govardhan Reddy : నేడు కాకాణి హాజరవుతారా?
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది;

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు కాకాణి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేసి వచ్చారు. కాకాణి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే కాకాణి గోవర్థన్ రెడ్డి నేడు నెల్లూరు వచ్చే అవకాశాలున్నాయి. ఆయన కూడా తాను గురువారం నుంచి అందుబాటులో ఉంటానని చెప్పారు.
వరసనోటీసులు ఇచ్చి...
దీంతో నేడు కాకాణి గోవర్థన్ రెడ్డి పోలీసుల ఎదుటకు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నేడు విచారణకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్థన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మైనింగ్ కేసులో ఆయనపై నమోదయని కేసులో విచారించడానికి పోలీసులు కాకాణి గోవర్థన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.