ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరికి వరద నీరు పెరుగుతుంది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు

Update: 2024-09-06 03:20 GMT

గోదావరికి వరద నీరు పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే వరద నీరు ఎక్కువగా చేరడంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేశారు.

నీటిమట్టం...
భద్రాచలం వద్ద 43.3 అడుగుల నీటి మట్టం ఉండి. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.52లక్షల క్యూసెక్కులుగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో ప్రభావిత ఆరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.


Tags:    

Similar News