Ys Jagan : వైఎస్ జగన్ పిటీషన్ పై నేడు విచారణ
తనకు భద్రత పెంచాలంటూ జగన్ వేసిన పిటీషన్ ను హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ జరపనుంది;

andhra pradesh high court
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. తనకు భద్రత పెంచాలంటూ జగన్ వేసిన పిటీషన్ ను హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. తనకు ప్రాణ హాని ఉందని, ప్రభుత్వం గతంలో ఉన్న సెక్యూరిటీని తగ్గించిందని తన భద్రతను పెంచాలంటూ పిటీషన్ ను జగన్ వేశారు.
వాహనం కూడా...
తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్ వేసిన పిటీషన్ ను హైకోర్టు స్వీకరణకు తీసుకుంది. దీనిపై నేడు విచారణ జరగనుంది. తనకు ఇచ్చిన వాహనం కూడా మరమ్మతులకు గురైన వాహనం అంటూ జగన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాలపై నేడు విచారణ జరిపి ఇరువర్గాల వాదనలు విననుంది.