మందేసి..చిందేసిన ఏఎస్సై.. ఉద్యోగం హుష్ కాకి

విధినిర్వహణలో ఉండి మద్యం తాగడమేకాకుండా చిందులేసిన ఏఎస్సై పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు;

Update: 2024-07-02 06:54 GMT

విధినిర్వహణలో ఉండి మద్యం తాగడమేకాకుండా చిందులేసిన ఏఎస్సై పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏఎస్సైను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో శంకరాపురం గ్రామంలో ఇటీవల రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు రాజకీయ పార్టీల కార్యకర్తలు గొడవ పడటంతో అక్కడ పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఘర్షణలో ముగ్గురు యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

బందోబస్తుకు వెళ్లి...
శంకరాపురం లో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో ఏఎస్సై వెంకటేశ్వర్లును అక్కడ బందోబస్తు డ్యూటీ వేశారు. అయితే ఏఎస్సై అక్కడి గ్రామస్థులతో మందుతాగుతూ చిందులు వేశారు. కార్లో మ్యూజిక్ పెట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై వెంటనే అధికారులు చర్యలు తీసుకున్నారు. బందోబస్తుకు వెళ్లి యూనిఫారంలో మద్యం తాగి చిందు వేయడంతో విధుల నుంచి తప్పించారు. తదుపరి చర్యల కోసం ఐజీకి లేఖ రాశారు.


Tags:    

Similar News