School Holiday : నేడు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో నేడు తిరుపతి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో నేడు తిరుపతి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 12 వ తేదీన నేడు గురువారం జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ఇంచార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ ప్రకటించారు.
భారీ వర్షాలకు...
వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు అంగన్ వాడీ కేంద్రాలకు నేడు డిసెంబర్ 12 వ తేదీన అంటే గురువారం ఒక రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇన్ ఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ ఒక ప్రకటనలో తెలిపారు.