ఏపీలో మే 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మీడియట్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు విడుదలయ్యాయి.;

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మీడియట్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు విడుదలయ్యాయి. అయితే ఈ పరీక్షల్లో ఫెయిల్ వారికి సప్లిమెంటరీ పరీక్షల తేదీని ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వివరాలను వెల్లడించారు.
ఫీజు చెల్లింపునకు గడువు...
మే 12 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12గంటలకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు... ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు విధించారు.