నేడు మేకపాటి ఉత్తర క్రియలు

Update: 2022-03-03 03:02 GMT
mekapati gautam reddy, tenth day, udayagiri
  • whatsapp icon

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉత్తర క్రియలు నేడు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరగనున్నాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించి నేటికి పదోరోజు. ఇందుకోసం ఉత్తర క్రియల కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఉదయగిరిలోని మేకపాటి కుటుంబానికి మెరిట్స్ కళాశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్నప్పటి నుంచి మరణించే ముందు వరకూ ఉన్న జ్ఞాపకాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు....
ఇదంుకోసం ప్రత్యేకంగా ఐదు ఎల్‌సీడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ కార్యకర్తలు, మేకపాటి అభిమానులు తరలి రానున్నారు. ఈ కార్యక్రమానికి పది మంది మంత్రులు, ఎంపీలతో పాటు, యాభై మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశముంది. ఇక్కడకు వచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆదేశించారు.


Tags:    

Similar News