శ్రీశైలంలో నేడు రథోత్సవం
శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు చివర రోజుకు చేరుకున్నాయి;

శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు చివర రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది భక్తుల శ్రీశైలం ఆలయానికి చేరుకోవడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శ్రీ భమరాంబికా మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాత్రికి తెప్పోత్సవం...
స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నేడు నిర్వహిస్తున్నారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు ఆలయపుర వీధుల్లో రథోత్సవం జరగనుంది. రాత్రి 8గంటలకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. నిన్న శివరాత్రి నుంచే భక్తులు అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి చేరుకోవడంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.