నేడు తిరుమలకు చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నేడు తిరుమలకు చేరుకోనున్నారు. రేపు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో శ్రీవారిని దర్శించుకుంటారు;

Update: 2024-08-21 03:47 GMT
chiranjeevi, birthday, visit, tirumala
  • whatsapp icon

మెగాస్టార్ చిరంజీవి నేడు తిరుమలకు చేరుకోనున్నారు. రేపు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన నేటి రాత్రికి తిరుమలకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలసి చిరంజీవి తిరుమలకు వస్తున్నారు. రేపు పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకుంటారు.

ఈరోజు రాత్రికి...
ఈరోజు రాత్రికి తిరుమలకు చేరుకోనున్న మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు వేకువ జామును సుప్రభాత సేవలో చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటారు. తిరుమలకు చిరంజీవి రానుండటంతో పెద్దయెత్తున అభిమానులు తరలి వచ్చే అవకాశముండటంతో అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ చేసింది.


Tags:    

Similar News