వర్షం తో తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావారణ శాఖ తెలిపింది.

Update: 2022-06-16 02:49 GMT

నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించినట్లు వాతావారణ శాఖ తెలిపింది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు, తెలంగాణలోనూ ఈ రుతుపవనాలు విస్తరించే అవకాశమున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది.

రాయలసీమలో.....
ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతు పవనాల ప్రభావం కారణంగా హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మరింతగా రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురిసే అవకాశముంది.


Tags:    

Similar News