ఆర్కే రోజాపై మంత్రి గుమ్మడి ఫైర్
మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు;

మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉందన్న మంత్రి సిగ్గుశరం లేకుండా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలు చీ కొట్టి పదకొండు సీట్లు ఇచ్చారన్నారు. రాష్ట్రం నుండి ప్రజలు తరిమి తరిమి కొట్టడానికి మరొక్కసారి సిద్ధంగా ఉన్నారన్న గుమ్మడి సంధ్యారాణి, గత వైసీపీ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు మర్చిపోయి ఇప్పుడు సుద్దాపుసలాగా మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు.
ఆడుదాం ఆంధ్ర పేరుతో...
ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల నయా పంథాలో దోపిడీ చేసి గురివింద సామెతలు చెబుతుందన్నారు. యువత పేరుతో అడుదాం ఆంధ్ర అని పెట్టి వృద్ధుల పేర్లతో దోపిడీ చేసిన సంగతి బట్టబయలు అయినా ఇంకా రోజా మాట్లాడటం సిగ్గుచేటంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. రోజా ఇప్పుడు గురివింద గింజ సమేత గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుందని, వైసీపీ అక్రమ దోపిడీ అన్యాయాలు మరచిపోయి పదకొండు సీట్లుఇచ్చినా సిగ్గులేకుండా మాట్లాడుతూ ఉండటం చూస్తే ఇంగిత జ్ఞానం లేని వైసీపీ నేతలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు.