వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైసీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయంకేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు;

Update: 2024-09-05 01:55 GMT
nandigam suresh, former ycp mp, bail petition, high court in ap, nandigam suresh latest news today, nandigam sureshs bail petition latest update

 nandigam suresh

  • whatsapp icon

వైసీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయం కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ తో పాటు మరికొందరు ఆశ్రయించినా హైకోర్టు పిటీషన్ ను తిరస్కరించింది. ఆయన ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ లేరు.

సె‌ల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా..
అయితే ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నందిగం సురేష్ ను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. వీరు అజ్ఞాతంలోకి వెళ్లగా వారిని వెదికేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు


Tags:    

Similar News