Andhra Pradesh : నేడు ఏపీలో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళిగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతిపాల్గొంటారు
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళిగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతిపాల్గొంటారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కర్యాక్రమంలో పాల్గొంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిమ్స్ వరకూ ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.
విద్యార్థులకు పురస్కారాలు...
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పురస్కారాలు అందచేయనున్నారు.ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారికి పురస్కారాలు అందచేస్తారు. వీరతో పాటు డిగ్రీపూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర పతి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమం పూర్తయిన అనంతరం ఆమె హైదరాబాద్ బయలుదేరి వెళతారు. హైదరాబాద్ లో శీతాకాల విడిది చేస్తారు. ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ రాష్ట్రపతి హైదరాబాద్ లోనే ఉంటారు.