సజ్జల భార్గవ్ కు హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. మరో రెండు వారాల పాటు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనపై నమోదయిన తొమ్మిది సోషల్ మీడియా కేసులను క్వాష్ చేయాలని సజ్జల భార్గవరెడ్డి హైకోర్టున ఆశ్రయించారు.ఈ మేరకు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.
రెండు వారాల పాటు...
సజ్జల భార్గవరెడ్డి తమపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడానికి కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈపోస్టులు తానుచేయకపోయినా తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సజ్జల భార్గవరెడ్డికి ఊరట దక్కేలా కొంత కాలం పాటు అరెస్ట్ నుంచి మినహాయింపు నిస్తూ ఆదేశాలు జారీ చేసింది.