TDP : టీడీపీలో జోగి రమేష్ కలకలం.. వారిద్దరికీ క్లాస్ పీకుతారా?
టీడీపీలో జోగి రమేష్ అంశం చర్చగా మారింది. టీడీపీ నేతలు పాల్గొన్న కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడం వివాదంగా మారింది.
తెలుగుదేశం పార్టీలో జోగి రమేష్ అంశం చర్చగా మారింది. టీడీపీ నేతలు పాల్గొన్న కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడం వివాదంగా మారింది. సర్దార్ గౌతు లచ్చన్న కు సంబంధించి జరిగన కార్యక్రమంలో మంత్రి పార్థసారధి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. వీరితో పాటు జోగి రమేష్ కూడా ఆ కార్యక్రమంలో కనిపించారు.
చంద్రబాబు ఇంటి మీదకు...
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు దాడికి వచ్చిన జోగి రమేష్ ను పార్టీ నేతలు తమ కార్యక్రమంలో ఎలా కలుపుకుపోతారని సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరా తీశారు. పార్థసారధి, గౌతు శిరీషను వివరణ కోరినట్లు తెలిసింది.