కృష్ణానదికి మళ్లీ వరద నీరు.. భయాందోళనలో ప్రజలు
కృష్ణా నదికి వరద వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే వరదనీరు పెరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు
కృష్ణా నదికి మళ్లీ వరద వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే వరదనీరు పెరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ప్రకాశం బ్యారేజీకీ 45వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నట్లు బ్యారేజ్ ఏఈ దినేశ్ తెలిపారు. అదే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
చేపల వేటకు...
కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. మత్స్యాకారులు ఎవరూ కృష్టానదిలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇటీవలే కృష్ణా నదికి వరదలు వచ్చి విజయవాడ పట్టణంలోకి వరద నీరుచేరడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మహారాష్ట్ర,తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరుతుంది.