నేడు అప్పన్న ఆలయంలో గిరిప్రదక్షిణ

నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ జరగనుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భక్తులు 32 కిలోమీటర్ల మేరకు ప్రదక్షణ చేస్తారు.

Update: 2022-07-12 02:58 GMT

నేడు సింహాచలం ఆలయంలో గిరి ప్రదక్షిణలు జరగనున్నాయి. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కొండ చుట్టూ భక్తులు 32 కిలోమీటర్ల మేరకు ప్రదక్షణ చేస్తారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత రెండేళ్లుగా కరోనాతో ఈ గిరి ప్రదిక్షిణలు జరగలేదు. రెండేళ్ల తర్వాత తొలిసారి గిరిప్రదిక్షిణలు జరుగుతుండటంతో లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముంది.

నాలుగు లక్షల మంది...
గిరి ప్రదక్షిణకు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశుముందని సింహాచలం ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సౌకర్యంతో పాటు మెడికల్ క్యాంప్ లను కూడా దేవస్థానం ఏర్పాటు చేసింది. పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏరప్ాటు చేశారు. సముద్రంలో స్నానాలు ఆచరించి భక్తులు గిరి ప్రదిక్షణకు రానున్నారు. అందుకే అన్ని చోట్ల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News