Tirumala Update: శ్రీవారి దర్శనానికి పదిహేను గంటల సమయం

నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

Update: 2024-02-12 01:52 GMT

devotees, normal, income, tirumala, darshan, timings

Tirumala Update:నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శని, ఆదివారాలు వచ్చిన భక్తులు సోమవారం కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ లైన్‌లో బారులు తీరారు. వీకెండ్ లో సహజంగా శుక్రవారం నుంచి సోమవారం వరకూ తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

ఆదాయం మాత్రం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,256 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,021 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News