Vijayawada CCTV: విజయవాడలో వరద నీరు ఎలా చేరిందో చూపించే వీడియో

విజయవాడను ఇటీవల వరద నీరు ముంచేసిన;

Update: 2024-09-10 14:15 GMT
Vijayawada CCTV: విజయవాడలో వరద నీరు ఎలా చేరిందో చూపించే వీడియో
  • whatsapp icon

విజయవాడ లోని పలు ప్రాంతాలను ఇటీవల వరద నీరు ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని క్షణాల్లో నీరు ఎలా వీధుల్లో చేరిపోయాయో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయవాడలోని ఒక వీధిలో వరదనీరు ముంచెత్తిన టైమ్-లాప్స్ ఫుటేజ్ ఇది. భారీ వర్షం, వరదల కారణంగా దాదాపు 50 మంది మరణించారు. 10 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు.

బుడమేరు కాలువ తెగిపోవడంతో విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌లో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలిపే సీసీటీవీ ఫుటేజీని గమనించవచ్చు. ఆ సమయంలో స్థానికులు ఎలా ప్రవర్తించారో కూడా మనం చూడొచ్చు. మూడు గంటల్లోనే రోడ్డు మీద నాలుగు అడుగుల వరకూ నీరు చేరిపోయింది. మురికి నీటితో నిండిన వరదనీటిలో ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థ పదార్థాలు వీధి వెంట ప్రవహించాయి. నీటి మట్టం పెరగడంతో, కొంతమంది బైక్ లో వెళ్లడానికి ప్రయత్నించారు. మరికొందరు ఇంటి నుండి కూడా వెళ్లిపోయారు.




Tags:    

Similar News