YSRCP : నేడు ఎంపీలతో జగన్ భేటీ

వైసీపీ అధినేత జగన్ నేడు పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు;

Update: 2024-06-14 03:07 GMT
YSRCP : నేడు ఎంపీలతో జగన్ భేటీ
  • whatsapp icon

వైసీపీ అధినేత జగన్ నేడు పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి లోక్‌సభలో ఇటీవల ఎన్నికలలో గెలిచిన నలుగురు ఎంపీలతో పాటు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు హాజరు కావాలని సమాచారం వెళ్లింది.

భవిష‌్యత్ కార్యాచరణపై...
వీరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ నేడు ఎంపీలతో సమావేశం కానున్నారు. రానున్న కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. రాజ్యసభ సభ్యులు, ఎంపీలు పార్టీ లైన్ దాట కుండా, ఈ ఐదేళ్లు కష్టపడితే వారికి భవిష‌్యత్ లోనూ మంచి అవకాశాలుంటాయని జగన్ చెప్పే అవకాశముంది.


Tags:    

Similar News