విజయసాయి వెరైటీ ట్వీట్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెరైటీగా ట్వీట్ చేశారు;

Update: 2023-09-11 04:36 GMT
vijayasai reddy, rajya sabha member, chandrababu, tweet
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెరైటీగా ట్వీట్ చేశారు. ట్వీట్ చేయడంలో విజయసాయిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. ఏ పరిణామమైనా వెంటనే స్పందించడంతో పాటు లాజిక్ తో విజయసాయి రెడ్డి తన ట్వీట్ ద్వారా ఫ్యాన్ పార్టీ అభిమానులను అలరిస్తూ ఉంటారు.

బాబు అరెస్ట్ పై...
తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు ఈ నెల 22వరకూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతీ విదితమే. ఆయనను తెల్లవారు జామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. అయితే చంద్రబాబుకు జైలు అధికారులు ఖైదీ నెంబరు 7691 నెంబరును కేటాయించారు.
మళ్లీ నెంబరు 23 అంటూ...
దీనిపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. "చంద్రబాబు ఖైదీ నెంబరు 7691. 7+6+9+1 = 23. మీకు 2023 చివరి సంవత్సరం. 2024 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదనకు చెందారో ఇప్పుడు అర్థం అయ్యుంటుంది మీకు" అంటూ ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags:    

Similar News