బెయిల్ రద్దు ఎందుకవుతుంది భయ్యా : వైఎస్ షర్మిల
వైఎస్ జగన్ పై ఆస్తుల వివాదంలో మరోసారి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ పై ఆస్తుల వివాదంలో మరోసారి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని షర్మిల అన్నారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదని, 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని ఆమె తెలిపారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్న వైఎస్ షర్మిల స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదని, గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ.. వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో ట్రెండింగ్, బదిలీలను మాత్రం ఆపలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.2016 లో ఈడీ, భూములను అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా మీరు చెప్పడం హాస్యాస్పదమన్న షర్మిల 2019 లో షర్మిలా రెడ్డి గారికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ మీద సంతకం చేశారని అన్నారు. అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని ? అని ప్రశ్నించారు.