Ayodhya : చెక్కు చెదరని ఆలయం.. దేశంలో ఇదే మొదటిది
అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని అత్యంత ఆధునికతను జోడించి నిర్మించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ప్రత్యేకతలున్నాయి.
అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని అత్యంత ఆధునికతను జోడించి నిర్మించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. మూడేళ్ల పాటు శ్రమించి నిర్మించిన ఈ ఆలయంలో మరికాసేపట్లో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. మన దేశంలో పురాతన కాలంలో.. అంటే మన పూర్వీకులు నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. నాటి నిర్మాణ శైలి వేరు. కట్టడంలో వినియోగించిన వస్తువులు వేరు. అలా నిర్మించబట్టే నేటికి శతాబ్దాలు మారినా ఆ నిర్మాణాలు మనముందు సాక్షాత్కరిస్తున్నాయి.
పూర్వీకులు నిర్మించిన..
వాటిని చూసి మనం నాటి మన పూర్వీకుల ప్రతిభను గుర్తించడమే కాదు... అలనాటి జ్ఞాపకాలను కూడా పదిలం చేసుకుంటున్నారు. గుర్తు చేసుకుంటున్నాం. అలాంటిదే ఈ అయోధ్యరామాలయం కూడా. వెయ్యేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఆలయాన్నినిర్మించారు. టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ఈ మేరుకు సాంకేతిక సహకారాన్ని అందించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ మందిరాన్ని నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ ఆలయం.. హిందూ మనోభావాలను ఏమాత్రం దెబ్బతినకుండా మరింత శోభించేలా ఆలయ నిర్మాణం జరుగుతుంది.
నగారా శైలిలో...
నగారా నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు. పూర్తిగా రాతితోనే ఆలయాన్ని నిర్మించారు. మూడువందల అరవై స్థంభాలతో మూడంతస్థులతో కూడిన ఈ ఆలయం భూకంపం వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరదు. రిక్టర్ స్కేల్ 6.5 తీవ్రత ఉన్నా ఈ ఆలయం తట్టుకునేలా నిర్మించారు. మన పూర్వీకులు వాడిన రాయినే ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. పునాదులు కూడా పటిష్టంగా ఉన్నాయి. కొన్ని తరాలు ఈ ఆలయాన్ని దర్శించుకునేలా ఈ అపురూప కట్టడాన్ని నిర్మిస్తున్నారు. అందుకే అయోధ్యకు అంత ప్రత్యేకత ఉంది. అందులోనూ రామాలయం కావడంతో మరింత విశిష్టత చేరింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి వాడిన వస్తువుల విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.