Ayodhya : ఈ పక్షిని ఈరోజు చూస్తే చాలట.. అయోధ్య వెళ్లకపోయినా పరవాలేదు

నీలకంఠం పక్షిని ఈ శుభఘడియల్లో చూస్తే చాలు ఎంతో పుణ్యం వస్తుందని అందరూ భావిస్తారు

Update: 2024-01-22 03:38 GMT

నీలకంఠం పక్షిని ఈ శుభఘడియల్లో చూస్తే చాలు ఎంతో పుణ్యం వస్తుందని అందరూ భావిస్తారు. అందుకోసమే జూలకు కడుతున్నారు. ఆగ్రాలోని వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి జనం పెద్ద సంఖ్యలో నేడు ఉదయం నుంచే చేరుకున్నారు. దీనికి ప్రధాన కారణం నీలకంఠ పక్షిని చూడటం కోసమే. అయోధ్యలో కాసేపట్లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో నీలకంఠ పక్షి విశిష్టతను పురాణాల్లో చదివిన వారంతా శాంక్చుయరీకి క్యూకట్టారు. అందుకు పురాణాల్లో చెప్పిన కథలే ఆధారంగా చూడాలి.

రామాయణంలో చదివి...
రామాయణం అంటే కష్టాలు.. సుఖాలు... అనోన్య దాంపత్యం.. అన్నదమ్ముల అనుబంధం... తండ్రి మాటను జవదాటని వైనం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. వర్ణించలేం. రామాయణం నేర్పని పాఠమంటూ లేదు. నేర్పని విషయమూ లేదు. అందుకే దేశంలో రామాయణానికి అంతటి ప్రాముఖ్యత. రామాయణంలోని ప్రతి అంశాన్ని హిందువులు తమకు అనుకూలంగా మలచుకుని జీవిస్తే ఇక రామరాజ్యం ఆవిష‌ృతమవుతుందటారు. అలాంటి రామాయణంతో పాటు వివిధ చరిత్ర పుస్తకాలు చదివిన వారు నేడు ఆగ్రాలోని చంబల్ వైఫ్ లైఫ‌ శాంక్చుయరీకి వెళుతున్నారంటే అతిశయోక్తి లేదు.
పక్షిని చూసేందుకు...
రామాయణంలో తెలిపిన విధంగా నీలకంఠ పక్షిని ఈరోజు చూస్తే తమ జన్మ ధన్యమయినట్లేనని భావించే భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారు. రామాయణంలో పేర్కొన్నట్లు ఈ నీలకంఠ పక్షిని చూసిన అనంతరమే శ్రీరాముడు రావణాసురుడిని చంపి సీతమ్మ వారిని తన చెంతకు తెచ్చుకున్నారని ఉంది. అంటే ఈ పక్షిని ఈ శుభఘడియల్లో చూస్తే తమతో పాటు కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని భావించి అందరూ పక్షి కోసం వెళుతున్నారు. అందుకే ఈరోజు అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ నీలకంఠ పక్షికి అంత ప్రత్యేకత ఏర్పడింది.


Tags:    

Similar News