Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది;

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నా ఈ పెరుగుదల ఎవరి చేతుల్లోనూ లేకపోవడంతో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులు కూడా ధరలు పెరగకూడదని కోరుకుంటున్నారు. ధరలు పెరిగినందువల్ల అమ్మకాలు గణనీయంగా పడిపోతాయని, అదే ధరలు అందుబాటులో ఉంటే తమకు సేల్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ తమ వ్యాపారం బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతుంది.
బంగారం నిల్వలు లేక...
ఇప్పటికే తులం బంగారం ధర 90 వేలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,13 లక్షల రూపాయలు పలుకుతుంది. ఇంకా ఎంత పెరుగుతాయో చెప్పలేమంటున్నారు. డిమాండ్ తగినంత లేకపోయినా ధరలు పెరగడానికి వేరే కారణాలున్నాయని చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి కావాల్సిన బంగారం నిల్వలు రాకపోవడంతో ధరల పెరుగుదల ప్రారంభమయిందని చెబుతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి మొదలయిన పసిడి పరుగు ఇక ఆగడం మాత్రం జరగడం లేదు. మధ్యలో బ్రేకులు పడుతున్నా ధరలు దిగివస్తాయని ఆశగా చూస్తున్న వారికి మాత్రం నిరాశ ఎదురవుతుంది. కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా ధరలను చూసి వెనక్కు తగ్గుతున్నారు.
ధరలు పెరగడంతో...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరలు మరింత పెరగడమే కాని, ఇక తగ్గడమనేది జరగదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారాన్ని ఎంత ధర పెట్టి కొనుగోలు చేసినా నష్టం రాదని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,510 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,010 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,13,100 రూపాయలుగా నమోదయింది.