Gold Price Today : రోజూ షాకిస్తున్న బంగారం ధరలు.. ఇక కొనడం గగనమే

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపించింది.;

Update: 2025-03-20 03:20 GMT
gold rates today in hyderrabad, prices, increased, india
  • whatsapp icon

బంగారం ధరలకు అదుపు లేకుండా పోతుంది. రోజూ పెరుగుతూ వినియోగదారులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. రికార్డు స్థాయికి ఇప్పటికే చేరుకున్న బంగారం, వెండి ధరలు ఇంకా పైపైకి ఎగబాకే అవకాశముందని చెబుతున్నారు. గ్రాము బంగారం కొనుగోలు చేయడం కూడా ఇప్పుడు సామాన్యుడికి కష్టంగా మారింది. పది గ్రాముల బంగారం ధర తొంభై వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్షా పథ్నాలుగు వేల రూపాయలు పలుకుతుంది. ఇలా పెరుగుతూ పోతే ఇక బంగారాన్ని కొనుగోలు చేయడం గగననమే అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ధరలను చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు తగ్గే అవకాశం కనుచూపు మేరలో కనిపిస్తుందన్న నమ్మకం లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు.

తగ్గిన అమ్మకాలు...
పసిడి పరుగులను చూసి వ్యాపారులే ధైర్యాన్ని కోల్పోతున్నారు. అమ్మకాలపై ధరల పెరుగుదల ప్రభావం చూపుతుందనుకుంటున్న వారి భయం నిజం అవుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. గతంతో పోల్చుకుంటే బంగారం, వెండి అమ్మకాలు 70 శాతం మేరకు పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. రాను రాను ఇంకా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, అసలు బంగారు దుకాణాల మనుగడ కష్టంగా మారుతుందన్న కామెంట్స్ కూడా వినిపడుతున్నాయి. అందుకే వ్యాపారులు అనేక రాయితీలు ఇస్తూ భారీగా ప్రకటనలు చేస్తున్నా అటు వైపు చూసేందుకు కూడా కొనుగోలు దారులు వెనుకంజ వేస్తున్నారు.
ధరలు పెరుగుతూనే...
గతంలో ఎన్నడూ లేని విధంగా 2025 సంవత్సరం బంగారం మాత్రం అందరికీ అందని వస్తువుగా మారింది. కేవలం పెట్టుబడిగా భావించే వారు తప్పించి అవసరాల కోసం కొనుగోలు చేసే వారు మాత్రం విముఖత చూపుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,910 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,450 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 1,14,100 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News