బాలికపై అత్యాచారం.. నిందితుల్లో మతపెద్ద ?
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బందా జిల్లాలో ఓ వ్యక్తికి 11 ఏళ్ల బాలికతో వివాహం నిశ్చయమైంది. కొన్ని కారణాల వల్ల ఆ వివాహం..
ఆడపిల్లలు, మహిళలపై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చట్టాలు తెస్తున్నారో.. నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నేరస్తులను ఎన్ కౌంటర్ చేసినా.. కామాంధుల్లో మచ్చుకైనా మార్పు రావడం లేదు. తనతో జరగాల్సిన పెళ్లి ఆగిపోవడంతో ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన నేరాలకు నెలవైన యూపీలో జరగగా నిందితుల్లో ఓ మత పెద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బందా జిల్లాలో ఓ వ్యక్తికి 11 ఏళ్ల బాలికతో వివాహం నిశ్చయమైంది. కొన్ని కారణాల వల్ల ఆ వివాహం ఆగిపోయింది. దాంతో కోపం పెంచుకున్న సాహిల్ బంధువుల సహాయంతో బాలికను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోవడంతో జులై 7న తల్లిదండ్రులు ఐదుగురిపై ఫిర్యాదు చేయగా.. కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తర్వాత బాలిక తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పడంతో.. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో మౌలానా గా పిలిచే మతగురువు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రేపు కోర్టులో హాజరుపరచనున్నారు.