Telangana : దుబాయ్ లో తెలంగాణ వాసి దారుణ హత్య
తెలంగాణకు చెందిన ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి దుబాయ్ లో హత్యకు గురయ్యారు;

తెలంగాణకు చెందిన ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి దుబాయ్ లో హత్యకు గురయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనతో నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. నిర్మల్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ అనేక వ్యక్తి గత ఆరేళ్లుగా దుబాయ లో పనిచేస్తున్నాడు. ఒక బేకరీలో పనిచేస్తున్నాడు.అయితే అదే బేకరీలో పనిచేస్తున్న మరొక వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది.
బేకరిలో పనిచేస్తున్న...
గత శుక్రవారం ఆవ్యక్తి ప్రేమ్ సాగర్ పై కత్తితో దాడి చేశాడు. మోడ్రన్ బేకరీలో పనిచస్తున్న మరొకవ్యక్తి ఈ దాడి చేయడంతో అక్కడ ప్రేమ్ సాగర్ మరణించాడు. కత్తితో దాడి చేయడంతో ప్రేమ్ సాగర్ మరణించాడని అతని బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ప్రేమ్ సాగర్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణ పూర్తయిన తర్వాత ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని భారత్ కు పంపనున్నారు.