తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

ఈ ఘటన పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లా ఫగ్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను..;

Update: 2023-05-28 07:40 GMT
12 years girl gives birth to baby

12 years girl gives birth to baby 

  • whatsapp icon

తాను గర్భం దాల్చిందని ఆ బాలికతో పాటు ఆమె తండ్రికి కూడా తెలియలేదు. తీవ్ర కడుపునొప్పితో విలవిల్లాడుతున్న 12 ఏళ్ల కూతురిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమె గర్భవతి అని గుర్తించి.. బిడ్డను బయటికి తీశారు. ఈ ఘటన పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లా ఫగ్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను తండ్రి గురునానక్‌దేవ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్థారించారు. వెంటనే ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కుమార్తె 7 నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోందని తెలిపాడు. ఆస్పత్రికి వచ్చాక వైద్యులు చెప్పేంతవరకూ ఆమె గర్భవతి అనే విషయం తనకు తెలియదన్నాడు. భార్య తామిద్దరినీ వదిలేసి వెళ్లిపోయిందని, ప్రస్తుతం ఇంట్లో తామిద్దరమే ఉంటామని వివరించాడు. పోలీసులు బాలికను ప్రశ్నించగా.. 7 నెలల క్రితం బహిర్భూమికి వెళ్లిన సమయంలో తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.


Tags:    

Similar News